Friday, August 15, 2025
spot_img
HomeSouth ZoneAndhra Pradesh28వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి..

28వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి..

ఆత్మకూరు సిపిఐ తాలూకా కార్యదర్శి టి. ప్రతాప్…

 

 

 పట్టణంలోని స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయం నందు సిపిఐ తాలూకా కార్యదర్శి టీ.ప్రతాప్, పట్టణ కార్యదర్శి అమ్మద్ హుస్సేన్ అధ్యక్షతన 23వ తేదీ జరగబోయే సిపిఐ రాష్ట్ర 28వ మహాసభలను జయప్రదం చేయాలని పోస్టర్ను ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ 28వ రాష్ట్ర మహాసభలను ప్రకాశం జిల్లా ఒంగోలులో జరగనున్నాయని ఈ మహాసభను ప్రజలందరూ కలిసి జయప్రదం చేయాలని వంద సంవత్సరాలు పూర్తి చేసుకుని సితజయంత ఉత్సవాలు నిర్వహించుకున్న ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే అది సిపిఐ పార్టీ అని, ప్రజల పక్షాన నిరంతరాయంగా పోరాడుతూ ప్రజా సమస్య పరిష్కార వేదికగా మారుతున్న సిపిఐ పార్టీని అందరూ ఆదరించాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ కేజీ రోడ్ అమాలి యూనియన్ నాయకులు చాంద్ బాషా, లల్లు, రఫీ, రజాక్ మియా, మున్సిపల్ ఏఐటీయూసీ నాయకులు ఏ. బిసన్న, నాగరాజు, అలీ షేర్ పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments