Home South Zone Telangana కాలనీల అభివృద్ధి దిశగా 133 డివిజన్ కార్పొరేటర్ రా జితేంద్రనాథ్

కాలనీల అభివృద్ధి దిశగా 133 డివిజన్ కార్పొరేటర్ రా జితేంద్రనాథ్

0

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : మచ్చబొల్లారం రాయల్‌ ఎన్‌క్లేవ్‌ కాలనీ, లక్ష్మీనగర్‌ వాసులు తమ కాలనీల్లో సీసీ రోడ్ల ఏర్పాటుకు మచ్చబొల్లారం డివిజన్‌ కార్పొరేటర్‌ జితేంద్రనాథ్‌ను కలిసి వినతి పత్రాలు సమర్పించారు. రాయల్‌ ఎన్‌క్లేవ్‌లోని రోడ్‌ నెం.3, 8తో పాటు అవసరమైన చోట్ల సీసీ రోడ్లకు మంజూరు కల్పించాలని కాలనీ సంక్షేమ సంఘ సభ్యులు కోరారు. అదే విధంగా లక్ష్మీనగర్‌ వాసులు తమ ప్రాంతంలో గుర్తించిన రహదారులపై అత్యవసరంగా సీసీ రోడ్లు వేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా కార్పొరేటర్‌ జితేంద్రనాథ్‌ మాట్లాడుతూ రెండు కాలనీల వాసుల అభ్యర్థనల పట్ల సానుకూలంగా స్పందించానని, త్వరితగతిన అవసరమైన అనుమతులు, నిధుల మంజూరు కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

   – sidhumaroju 

Exit mobile version