Tuesday, September 30, 2025
spot_img
HomeSouth ZoneTelangana"బతుకమ్మ పండుగలో సద్దుల బతుకమ్మ" కార్పొరేటర్ నివాసంలో ఘనమైన వేడుక !

“బతుకమ్మ పండుగలో సద్దుల బతుకమ్మ” కార్పొరేటర్ నివాసంలో ఘనమైన వేడుక !

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ >    మొదటిరోజు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైన సంబురాలు 9వ రోజున సద్దుల బతుకమ్మతో ముగుస్తున్నాయి. ఇప్పటికే ఎనిమిది రోజుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎంగిలిపువ్వు బతుకమ్మ , అటుకల బతుకమ్మ , ముద్దపప్పు బతుకమ్మ , నానబియ్యం బతుకమ్మ , అట్ల బతుకమ్మ , అలిగిన బతుకమ్మ , వేపకాయల బతుకమ్మ , వెన్నముద్దల బతుకమ్మలతో జరుపుకున్నారు.  ఈ ఎనిమిదవ రోజు “సద్దుల బతుకమ్మ” వేడుకల్ని అల్వాల్ 134 డివిజన్ కార్పొరేటర్ “శాంతి శ్రీనివాస్ రెడ్డి” తన నివాసంలో  ఘనంగా నిర్వహించారు. 9వ రోజు అయిన ఆఖరి రోజున “సద్దుల బతుకమ్మ’ను” ఆరాధిస్తారు. ఈ రోజు ఎన్ని పూలు దొరికితే అన్ని పూలతో బతుకమ్మను పెద్దగా పేరుస్తారు. ఆడవారు తమ ఆటపాటలతో “సద్దుల బతుకమ్మ’ పండుగను జరుపుకుంటారు.

అలాగే పెద్ద బతుకమ్మ పక్కన చిన్నగా “గౌరమ్మ’ను” పసుపుతో తయారు చేస్తారు. ఆ గౌరమ్మను పూజించిన తర్వాత.. ఆ పసుపును తీసి ఆడవారు వారి చెంపలకు రాసుకుంటారు. అమ్మవారికి ఐదురకాల నైవేద్యాలు తయారు చేస్తారు. సాయంత్రం ఆడపడుచులు అందరూ చక్కగా దుస్తులు ఆభరణాలు ధరించి బతుకమ్మను వాకిలిలో పెడతారు. చుట్టుపక్కల మహిళలంతా చేరి ఐక్యతతో ప్రేమను కలపి చుట్టు నిలబడి పాటలు పాడుతారు. ఈ జానపద గీతాలు చుట్టు పక్కలా ప్రతిధ్వనిస్తూ ప్రత్యేకమైన తెలంగాణా సంస్కృతిని ఆవిష్కరిస్తాయి. ఇక చీకటి పడుతుంది అనగా.. ఆడపడుచులు ఈ బతుకమ్మలను తలపై పెట్టుకుని ఊరిలో ఉన్న చెరువుకు ఊరేగింపుగా బయలుదేరుతారు. అక్కడ మెల్లగా బతుకమ్మలను పాటలు పాడుతూ , ఆడుతూ నీటిలో జారవిడుస్తారు. ఆ తరువాత “మలీద” అనే పిండి వంటకాన్ని బంధు మిత్రులకు పంచిపెడతారు. ఈ సందర్భంగా.. ఆమె మాట్లాడుతూ బతుకమ్మ పండుగ మన తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీక, మహిళలు ఒకటిగా చేరి జరుపుకొనే  ఈ గొప్ప పండుగ. మన సాంప్రదాయాల సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. ఈరోజు జరుపుకున్న “సద్దుల బతుకమ్మ” సంబరాలకు హాజరైన ప్రతి ఒక్కరికి కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి  “అభినందనలు” తెలిపారు.
Sidhumaroju

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments