Home South Zone Telangana “బతుకమ్మ పండుగలో సద్దుల బతుకమ్మ” శాంతి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ఘనమైన వేడుక

“బతుకమ్మ పండుగలో సద్దుల బతుకమ్మ” శాంతి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ఘనమైన వేడుక

0

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ >    తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవ పండుగ బతుకమ్మను అల్వాల్‌లో ఘనంగా జరుపుకున్నారు. సోమవారం కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో సద్దుల బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.  ఈ వేడుకలకు అల్వాల్ డివిజన్‌కు చెందిన మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. రంగురంగుల చీరలతో మెరిసిన మహిళలు బతుకమ్మ చుట్టూ చేరి తాళాల కట్టులో పాటలు పాడుతూ ఆడిపాడారు.

బతుకమ్మ పూల పరిమళం, సద్దుల సమర్పణతో వాతావరణం మరింత భక్తిమయంగా మారింది. చిన్నారులు కూడా పెద్దల వెంట పాటలు పాడుతూ ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ— “బతుకమ్మ పండుగ మన తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీక. మహిళలు ఒక్కటిగా చేరి జరుపుకునే ఈ పండుగ మన సంప్రదాయాల సౌందర్యాన్ని ప్రతిబింబిస్తుంది” అన్నారు. ఆధునిక జీవనశైలిలోనూ బతుకమ్మ పండుగ ఆచారాలను కొనసాగించాల్సిన అవసరాన్ని ఆమె స్పష్టం చేశారు.
Sidhumaroju

Exit mobile version