తెలంగాణ పోస్టల్ సర్కిల్ అక్టోబర్ 1 నుండి ఓటీపీ ఆధారిత డెలివరీ విధానాన్ని ప్రవేశపెట్టనుంది.
ఈ కొత్త విధానం ద్వారా స్పీడ్ పోస్ట్, రిజిస్టర్డ్ పోస్టు వంటి ముఖ్యమైన పార్సెల్లు అందుకునే సమయంలో లబ్దిదారులకు ఓటీపీ పంపించి, ధృవీకరణ అనంతరం మాత్రమే డెలివరీ చేయనున్నారు. ఇది భద్రతను పెంచడమే కాక, తప్పుదారి పట్టే పార్సెల్లను నివారించేందుకు దోహదపడుతుంది.
అలాగే స్పీడ్ పోస్ట్ రేట్లను కూడా సమీక్షించి, కొత్త ధరలను అమలు చేయనున్నారు. ఈ మార్పులు వినియోగదారులకు మెరుగైన సేవలను అందించేందుకు తెలంగాణ పోస్టల్ శాఖ తీసుకున్న ముందడుగులు.