Home Sports ఒలింపిక్ పతక విజేతకు రెజ్లింగ్ సమాఖ్య షాక్ |

ఒలింపిక్ పతక విజేతకు రెజ్లింగ్ సమాఖ్య షాక్ |

0

పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత రెజ్లర్ అమన్ సెహ్రావత్‌పై భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) ఏడాది నిషేధం విధించింది.

సెప్టెంబర్ 2025లో క్రోయేషియాలో జరిగిన సీనియర్ వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌కు 57 కిలోల ఫ్రీస్టైల్ విభాగంలో ఎంపికైన అమన్, 1.7 కిలోల అధిక బరువుతో వెయిన్‌లో విఫలమయ్యాడు. ఈ కారణంగా WFI అతనిపై కఠిన చర్య తీసుకుంది. సమాఖ్యకు సమర్పించిన వివరణ అసంతృప్తికరంగా ఉండటంతో, దేశ ప్రతిష్టను దెబ్బతీసిన కారణంగా నిషేధం అమలులోకి వచ్చింది.

ఈ నిర్ణయం అమన్ ఆసియా గేమ్స్ 2026లో పాల్గొనలేని పరిస్థితిని కలిగించింది. న్యూఢిల్లీలోని క్రీడా వర్గాల్లో ఈ పరిణామం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Exit mobile version