Home South Zone Telangana స్థానిక సంస్థల ఎన్నికలకు షురూ.. నామినేషన్లకు గడువు |

స్థానిక సంస్థల ఎన్నికలకు షురూ.. నామినేషన్లకు గడువు |

0

తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. రెండు విడతల్లో జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి నేడు మొదటి విడత నోటిఫికేషన్ విడుదలైంది.

నేటి నుంచి ఈనెల 11 వరకు నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. ఈనెల 12న నామినేషన్ల పరిశీలన, 15వ తేదీ వరకు ఉపసంహరణకు గడువు ఉంది. అక్టోబర్ 23న మొదటి విడత పోలింగ్ జరగనుండగా, నవంబర్ 11న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని జిల్లాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి.

అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ప్రజాప్రతినిధుల ఎంపికకు ఈ ఎన్నికలు కీలకంగా మారనున్నాయి.

Exit mobile version