Home North Zone DELHI - NCR ఢిల్లీలో పరుగుల సునామీ! రెండో రోజు భారత్ పట్టు, విండీస్ విలవిల |

ఢిల్లీలో పరుగుల సునామీ! రెండో రోజు భారత్ పట్టు, విండీస్ విలవిల |

0

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత్ వర్సెస్ వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్ పట్టు బిగించింది.

రెండో రోజు ఆటలో టీమిండియా భారీ స్కోరు దిశగా దూసుకుపోతోంది. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్  అద్భుతమైన ఇన్నింగ్స్‌కు తెరపడింది.

175 పరుగుల వద్ద రనౌట్ రూపంలో నిరాశగా వెనుదిరిగాడు.

కెప్టెన్ శుభ్‌మన్ గిల్  కూడా అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ కీలకమైన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు.

జైస్వాల్, గిల్ భాగస్వామ్యం జట్టుకు పటిష్టమైన పునాది వేసింది.

పరుగుల వరద పారుతున్న ఈ పిచ్‌పై విండీస్ బౌలర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

భారత్ భారీ లక్ష్యాన్ని నిర్దేశించే దిశగా పయనిస్తోంది.

Exit mobile version