Home South Zone Telangana సెలూన్‌లో ప్రచారం.. మల్లారెడ్డి స్టైల్ వైరల్ |

సెలూన్‌లో ప్రచారం.. మల్లారెడ్డి స్టైల్ వైరల్ |

0
2

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో గెలుపే లక్ష్యంగా భారత రాష్ట్ర సమితి (BRS) ప్రచారాన్ని వేగవంతం చేసింది. పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్‌కు మద్దతుగా మాజీ మంత్రి మల్లారెడ్డి వినూత్నంగా ప్రచారం చేశారు.

నియోజకవర్గంలోని ఓ సెలూన్‌లోకి వెళ్లి అక్కడ హెయిర్‌కట్ చేయించుకుంటూ స్థానికులతో మమేకమయ్యారు. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి కూడా ప్రచారంలో పాల్గొన్నారు. ప్రజల మధ్యకి వెళ్లి వారి సమస్యలు తెలుసుకోవడమే లక్ష్యంగా మల్లారెడ్డి చేపట్టిన ఈ ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సాధారణ ప్రజలతో కలిసిపోయే ఈ విధానం ఓటర్లను ఆకట్టుకునేలా ఉంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఈ ప్రచారం ఎంతవరకు ప్రభావం చూపుతుందో చూడాలి.

NO COMMENTS