Home South Zone Telangana గంజాయి చాక్లెట్లను పట్టుకున్న స్పెషల్ టాస్క్ ఫోర్స్.

గంజాయి చాక్లెట్లను పట్టుకున్న స్పెషల్ టాస్క్ ఫోర్స్.

0

సికింద్రాబాద్:  సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ పోలీసులు గంజాయి చాక్లెట్లను పట్టుకున్నారు. ఎస్టీఎఫ్‌ ‌సీఐ నాగరాజు తన సిబ్బందితో కలిసి రైల్వే స్టేషన్ లో తనిఖీలు నిర్వహించారు. రైల్వే స్టేషన్‌ ఫ్లాట్‌ ఫారం 10 వద్ద అనుమానాస్పదంగా ఉన్న ఒక సంచిని పరిశీలించగా అందులో 1.600 కేజీల గంజాయి చాక్లెట్స్‌ ఉన్నట్లు గుర్తించారు. గంజాయి చాక్లెట్లను తీసుకవచ్చిన వ్యక్తి ఎక్సైజ్‌ పోలీసులను చూసి పరారయ్యాడు. ఎస్టిఎఫ్ పోలీసులు గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకుని సికింద్రాబాద్‌ ఎక్సైజ్‌ స్టేషన్‌లో అప్పగించారు. ఈ సందర్భంగా ఎస్టిఎఫ్ పోలీసులు రైల్వే స్టేషన్లలో అక్రమంగా చాక్లెట్ల రూపంలో గంజాయి ప్యాకెట్లను తరలిస్తున్న ముఠాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు.
Sidhumaroju

NO COMMENTS

Exit mobile version