Home South Zone Telangana ఫలితాన్ని మలచే బీసీ, ముస్లిం ఓటు శక్తి |

ఫలితాన్ని మలచే బీసీ, ముస్లిం ఓటు శక్తి |

0

హైదరాబాద్‌ నగరంలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్‌ రాజకీయంగా కీలకంగా మారింది. మొత్తం 4 లక్షల ఓటర్లలో సుమారు 2 లక్షల మంది బీసీలు ఉండగా, 96,500 మంది ముస్లింలు ఉన్నారు.

వీరిలో 30–39 ఏండ్ల మధ్య వయస్సు గల యువ ఓటర్లు 25% వరకు ఉన్నారు. ఈ సామాజిక వర్గాల ఓటు శక్తిని ఆకర్షించేందుకు అన్ని ప్రధాన పార్టీలు వ్యూహాత్మకంగా ప్రచారం తీవ్రతరం చేస్తున్నాయి.

అభివృద్ధి, ఉపాధి, భద్రత వంటి అంశాలపై దృష్టి సారిస్తూ, ఈ వర్గాలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. జూబ్లీహిల్స్ ఫలితాన్ని ఈ రెండు వర్గాల మద్దతే తేల్చనుంది.

NO COMMENTS

Exit mobile version