Home Business ఆటో రంగంలో హ్యుందాయ్‌ భారీ విస్తరణ |

ఆటో రంగంలో హ్యుందాయ్‌ భారీ విస్తరణ |

0

భారత ఆటోమొబైల్ రంగంలో హ్యుందాయ్‌ మోటార్స్‌ భారీ విస్తరణకు సిద్ధమైంది. దేశవ్యాప్తంగా రూ.45 వేల కోట్ల పెట్టుబడితో కొత్త ప్రాజెక్టులు, ఉత్పత్తి కేంద్రాలు, పరిశోధన అభివృద్ధి కార్యకలాపాలు చేపట్టేందుకు కంపెనీ ప్రణాళికలు రూపొందించింది.

ఈ పెట్టుబడి ద్వారా ఉద్యోగావకాశాలు పెరగడంతో పాటు, ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి మరింత ప్రాధాన్యం ఇవ్వనుంది.

తమిళనాడు సహా ఇతర రాష్ట్రాల్లో హ్యుందాయ్‌ విస్తరణకు సంబంధించి ప్రభుత్వాలతో చర్చలు జరుగుతున్నాయి. భారత మార్కెట్‌పై విశ్వాసంతో, హ్యుందాయ్‌ తన వ్యాపారాన్ని మరింత బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Exit mobile version