Home South Zone Andhra Pradesh రూ.13,400 కోట్లతో కర్నూలులో అభివృద్ధి శంకుస్థాపన |

రూ.13,400 కోట్లతో కర్నూలులో అభివృద్ధి శంకుస్థాపన |

0

ప్రధాని నరేంద్ర మోదీ నేడు కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఉదయం 10:30 గంటలకు ఓర్వకల్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయన, హెలికాప్టర్‌ ద్వారా శ్రీశైలం వెళ్లి 11:15కి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

అనంతరం శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించి, తిరిగి మధ్యాహ్నం 2:30కి కర్నూలుకు చేరుకుంటారు. ఓర్వకల్‌, కొప్పర్తి పారిశ్రామిక కారిడార్లతో పాటు రూ.13,400 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు.

అనంతరం ‘సూపర్ జీఎస్టీ.. సూపర్ సేవింగ్స్’ బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సభలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, రాష్ట్ర మంత్రులు పాల్గొననున్నారు. కర్నూలు ప్రజలు ఈ పర్యటనను ఉత్సాహంగా స్వాగతిస్తున్నారు.

NO COMMENTS

Exit mobile version