హైదరాబాద్‌లో కేంద్ర ప్రభుత్వ పథకాల పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని తెలంగాణ పోలీసు శాఖ హెచ్చరించింది. వాట్సప్ గ్రూపుల్లో ఫేక్ లింక్‌లు పంపిస్తూ, కేంద్ర పథకాల పేరుతో ప్రజలను మోసం చేయాలని ప్రయత్నిస్తున్నారని పేర్కొంది.
ఆయా పథకాలకు అర్హత ఉందో లేదో అధికారిక వెబ్‌సైట్లలోనే చెక్ చేసుకోవాలని, అపరిచితుల నుంచి వచ్చే లింక్‌లు, మెసేజ్‌లకు స్పందించవద్దని సూచించింది.
తొందరపడి లింక్‌లు క్లిక్ చేయడం వల్ల వ్యక్తిగత సమాచారం లీక్ అయ్యే ప్రమాదం ఉందని పోలీసు శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండి, కేవలం ప్రభుత్వ అధికారిక వనరులనే నమ్మాలని సూచించింది.