తెలంగాణ ప్రభుత్వం BC రిజర్వేషన్ల పెంపుపై తీసుకున్న నిర్ణయానికి సుప్రీంకోర్టు చుక్కెదురుగా నిలిచింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో BCలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన GO No.9పై హైకోర్టు స్టే విధించగా, దాన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం SLP దాఖలు చేసింది.
అయితే, సుప్రీంకోర్టు ఆ పిటిషన్‌ను కొట్టివేసింది. న్యాయమూర్తులు 50% రిజర్వేషన్ పరిమితిని గుర్తుచేస్తూ, పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలు నిర్వహించాలని సూచించారు.
ఈ తీర్పుతో రాష్ట్ర ప్రభుత్వానికి రాజకీయంగా, పరిపాలనా పరంగా ఎదురుదెబ్బ తగిలినట్లైంది. BC రిజర్వేషన్ల అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది.