విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించి ఒప్పందం కుదరడంతో నగరంలో రాజకీయ వేడి పెరిగింది.
గురువారం మద్దిలపాలెం, హనుమంతువాక, సిరిపురం, వెంకోజిపాలెం, పీఎం పాలెం క్రికెట్ స్టేడియం వంటి కీలక కూడళ్లలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఆయన కుమారుడు గంటా రవితేజ పేరిట భారీ హోర్డింగ్లు ఏర్పాటు చేశారు. “నాడు తండ్రి.. నేడు కొడుకు” అనే నినాదంతో హోర్డింగ్లు ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
విశాఖపట్నం జిల్లా ప్రజలు ఈ అభివృద్ధి ప్రక్రియను స్వాగతిస్తున్నప్పటికీ, రాజకీయ ప్రచారంగా మారుతున్న హోర్డింగ్లపై చర్చ కొనసాగుతోంది. డేటా సెంటర్ ద్వారా ఉద్యోగావకాశాలు, టెక్ రంగ అభివృద్ధి ఆశించబడుతోంది.