NDTV World Summit 2025 న్యూఢిల్లీ లోని భారత్ మండపం వేదికగా ఘనంగా ప్రారంభమైంది. అక్టోబర్ 17–18 తేదీల్లో జరిగే ఈ సమ్మిట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, శ్రీలంక ప్రధాని హరిని అమరసూర్య, యూకే మాజీ ప్రధాని రిషి సునక్, ఆస్ట్రేలియా మాజీ ప్రధాని టోనీ అబాట్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
“Edge of the Unknown: Risk, Resolve, and Renewal” అనే థీమ్‌తో, ఈ సమ్మిట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లైమేట్ మార్పు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వంటి కీలక అంశాలపై చర్చలకు వేదికగా నిలుస్తోంది.
సామంతా రూత్ ప్రభు, గ్రామీ విజేత రికీ కేజ్, BCCI సెలెక్టర్ అజిత్ అగార్కర్ వంటి సాంస్కృతిక ప్రముఖులు కూడా పాల్గొన్నారు.