Home South Zone Telangana బంద్‌కు అన్ని పార్టీల మద్దతు: బస్సులు నిలిపివేత |

బంద్‌కు అన్ని పార్టీల మద్దతు: బస్సులు నిలిపివేత |

0
2

తెలంగాణలో బీసీ సంఘాల బంద్‌ ఉదృతంగా కొనసాగుతోంది. 42 శాతం రిజర్వేషన్ల అమలుకు డిమాండ్ చేస్తూ బీసీ జేఏసీ పిలుపునిచ్చిన ఈ బంద్‌కు కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ సహా అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి.

రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. విద్యాసంస్థలు సెలవు ప్రకటించగా, వ్యాపార, వాణిజ్య సంస్థలు బంద్‌కు మద్దతు తెలిపాయి. అత్యవసర సేవలకు మినహాయింపు ఇచ్చారు.

బంద్‌ను శాంతియుతంగా జరపాలని పోలీసులు సూచించారు. హైదరాబాద్, ఖైరతాబాద్, వరంగల్, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో బస్సు డిపోల ఎదుట బీసీ నేతలు, రాజకీయ నాయకులు ఆందోళన చేపట్టారు.

NO COMMENTS