Home South Zone Andhra Pradesh ఆరు జిల్లాలకు రెడ్ అలర్ట్: వర్ష విరుచుకుపడే సూచనలు |

ఆరు జిల్లాలకు రెడ్ అలర్ట్: వర్ష విరుచుకుపడే సూచనలు |

0

ఆంధ్రప్రదేశ్‌లో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వాతావరణ శాఖ ఆరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. SPSR నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు, కడప జిల్లాల్లో అక్టోబర్ 22న అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

కొన్ని ప్రాంతాల్లో 204.5 మిల్లీమీటర్లకు మించి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని IMD హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల్లో నీటి ముంపు, రవాణా అంతరాయం, విద్యుత్ సరఫరాలో ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది.

ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలి. జిల్లా యంత్రాంగం అత్యవసర చర్యలు చేపట్టింది.

NO COMMENTS

Exit mobile version