హైదరాబాద్: భూ భారతి చట్టం అమలులో భాగంగా భూముల రిజిస్ట్రేషన్‌కు సర్వే మ్యాప్‌ను తప్పనిసరిగా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో భూముల సర్వే కోసం 2–3 నెలల పాటు వేచి చూడాల్సిన పరిస్థితి ఉండేది.
ఇప్పుడు ప్రత్యేక వెబ్‌సైట్, అప్లికేషన్ ద్వారా అప్లికేషన్ సమర్పణ, ఫీజు చెల్లింపు, సర్వే మ్యాప్ పొందడం వంటి ప్రక్రియలు పూర్తిగా ఆన్‌లైన్‌లోనే జరుగనున్నాయి. కొత్త లైసెన్స్‌డ్ సర్వేయర్లకు త్వరలో లాగిన్ వివరాలు ఇవ్వనున్నారు.
ఈ మార్పులతో గెట్ల పంచాయితీలకు చెక్ పడనుంది. భూ వివాదాలు తగ్గి, పారదర్శకత పెరగనుందని అధికారులు భావిస్తున్నారు. రైతులు, భూ యజమానులు ఈ వెబ్‌సైట్‌ను ఉపయోగించుకోవాలని సూచిస్తున్నారు.