బంగాళాఖాతంలో బలపడుతున్న తుఫాన్ “మోంథా” ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే నాలుగు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు రెడ్‌అలర్ట్ జారీ చేశారు.
గంటకు 60–80 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అన్ని ఓడరేవుల్లో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తీరప్రాంతాల్లో SDRF, NDRF బృందాలు మోహరించాయి.
ప్రజలు అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని అధికారులు సూచిస్తున్నారు. విశాఖపట్నం జిల్లాలో తుఫాన్ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున, స్థానికులు అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వం సహాయ చర్యలు ముమ్మరం చేస్తోంది
