ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలంలోని సింగరపల్లి గ్రామం వరదలతో జలదిగ్బంధమైంది. గత 24 గంటలుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గ్రామంలోని ఇళ్లలోకి వరదనీరు ప్రవేశించింది.
ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కాలువలపై జరిగిన ఆక్రమణల వల్లే వరద నీరు గ్రామంలోకి ప్రవేశించిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. రహదారులు, పొలాలు నీటితో నిండిపోయాయి.
అధికారులు సహాయక చర్యలు చేపట్టినా, పరిస్థితి ఇంకా తీవ్రంగానే ఉంది. ప్రజలు తాత్కాలికంగా సురక్షిత ప్రాంతాలకు తరలించబడుతున్నారు. గ్రామస్తులు కాలువల ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
