తెలంగాణలో Jubilee Hills బైపాల్ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం కీలక రాజకీయ నిర్ణయం తీసుకునే అవకాశముంది. మాజీ క్రికెట్ కెప్టెన్, కాంగ్రెస్ నేత మొహమ్మద్ అజహరుద్దీన్‌ను సీఎం రెవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర మంత్రి వర్గంలోకి చేర్చే యోచనలో ఉన్నట్లు సమాచారం.
ప్రస్తుతం మంత్రి వర్గంలో మైనారిటీలకు ప్రాతినిధ్యం లేకపోవడంతో, అజహర్‌ను చేర్చడం ద్వారా ముస్లిం ఓటర్లను ఆకర్షించాలన్న వ్యూహంతో కాంగ్రెస్ ముందుకు సాగుతోంది. AICC ఇప్పటికే అజహర్ పేరును ఆమోదించినట్లు తెలుస్తోంది.
అక్టోబర్ 31న ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుందని సమాచారం. Jubilee Hills నియోజకవర్గంలో ముస్లిం ఓటర్లు అధికంగా ఉండటంతో, ఈ నియామకం రాజకీయంగా కీలకంగా మారనుంది. అజహర్‌కి శాసనసభ లేదా శాసన మండలిలో సభ్యత్వం లేకపోయినా, గవర్నర్ కోటా ద్వారా MLCగా నామినేట్ చేయడం ద్వారా మంత్రి పదవి కల్పించే అవకాశం ఉంది.
