సికింద్రాబాద్: ప్యారడైజ్ నుంచి బోయిన్ పల్లి వరకు నిర్మిస్తున్న ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులను ప్రారంభించడంతో ఈరోజు నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులు ట్రాఫిక్ ఆంక్షలను విధించి వాహనాలను దారి మళ్ళిస్తున్నారు .
కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ గారు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి ట్రాఫిక్ అడిషనల్ డిసిపి వేణుగోపాల్ రెడ్డి, హెచ్ ఎం డి ఏ డిప్యూటీ ఇంజనీర్ విద్యాసాగర్ మరియు ఇతర అధికారులతో మాట్లాడి వాహనదారులకు ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణాన్ని చేపట్టిందని దీనివలన ట్రాఫిక్ ఇబ్బందులకు ప్రజలు గురి కావద్దని కావున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.
ముఖ్యంగా బాలంరాయి చౌరస్తా,అన్న నగర్ చౌరస్తా లలో తీవ్ర ట్రాఫిక్ జామ్ అవుతుందని, దీని వల్ల స్థానిక బస్తీల వాసులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు.
అలాగే వాహనదారులతో కూడా స్వయంగా మాట్లాడి వారి సూచనలను పోలీస్ అధికారుల దృష్టికి తీసుకువచ్చి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.
Sidhumaroju
