తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో ఏర్పడిన పరిస్థితులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ఉదయం 11 గంటలకు అమరావతిలోని సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. పంట నష్టం, వరదల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సహాయక చర్యల పురోగతి, పునరావాస చర్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
వ్యవసాయ శాఖ, రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖల అధికారులు, ప్రభావిత జిల్లాల కలెక్టర్లు ఈ సమీక్షలో పాల్గొననున్నారు. ముఖ్యంగా గుంటూరు, కృష్ణా, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పంట నష్టం తీవ్రంగా ఉండటంతో, అక్కడి పరిస్థితులపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు.
సమీక్ష అనంతరం సీఎం చంద్రబాబు సాయంత్రం హైదరాబాద్ వెళ్లనున్నారు. ఈ సమావేశం ద్వారా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం తీసుకునే తదుపరి చర్యలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
