Home South Zone Andhra Pradesh పాపం కన్న తల్లి ఎదుటే – అప్పు వివాదం ప్రాణం తీసింది|

పాపం కన్న తల్లి ఎదుటే – అప్పు వివాదం ప్రాణం తీసింది|

0

గుంటూరు జిల్లా దుగ్గిరాల రజక కాలనీలో నివసించే వీరబాబు తాపీ మేస్త్రిగా పనిచేస్తూ, అవసరమైనప్పుడు పరిచయస్తులకు అప్పులు ఇస్తూ ఉండేవాడు. తల్లి రమణ, భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ ఇంటి వద్దే విశ్రాంతి తీసుకుంటున్నాడు.

ఈ సమయంలో బంధువు నవీన్‌ రూ.10,000 అప్పు ఇప్పించాలని కోరాడు. గుంటూరులో చికెన్ వ్యాపారం చేసే నవీన్‌ ప్రతి ఆదివారం దుగ్గిరాలకు వచ్చి విక్రయం చేస్తాడు. అవసరమైనప్పుడు వీరబాబు వద్ద అప్పు తీసుకుని తిరిగి చెల్లించేవాడు.

అయితే ఈసారి వీరబాబు వద్ద డబ్బులు లేవని, ఎవరి వద్దా ఇప్పించలేనని స్పష్టంగా చెప్పాడు. దీనితో నవీన్‌కు తీవ్ర ఆవేశం వచ్చింది. ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. వీరబాబు నవీన్‌ చొక్కా పట్టుకుని, ఇకపై డబ్బులు అడగవద్దని గట్టిగా హెచ్చరించాడు. దీనితో ఆగ్రహంతో ఉన్న నవీన్‌ మద్యం సేవించి, తన బంధువు కృష్ణకు ఫోన్‌ చేసి ఘటన వివరాలు చెప్పాడు. వీరబాబు చేసిన అవమానాన్ని మరచిపోలేక తీవ్ర మనస్థాపానికి గురయ్యాడని తెలిపాడు.

NO COMMENTS

Exit mobile version