Home South Zone Andhra Pradesh రవాణా శాఖ అధికారిపై ఏసీబీ వేట |

రవాణా శాఖ అధికారిపై ఏసీబీ వేట |

0

డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు

ఏసీబీ వలకు చిక్కిన రవాణా శాఖ తిమింగలం

మహబూబ్‌నగర్ డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తూ, హైదరాబాద్ నగరంలోని బోయినపల్లిలో నివాసం ఉంటున్న ఎం.కిషన్ నాయక్

అవినీతి ఆరోపణల నేపధ్యంలో ఆయన ఇంటితో పాటు, నిజామాబాద్, నారాయణఖేడ్ ప్రాంతాల్లో ఉన్న తన బంధుమిత్రుల ఇళ్లతో కలిపి 12 చోట్ల తనిఖీలు నిర్వహించిన ఏసీబీ అధికారులు

అతనికి నారాయణఖేడ్ ప్రాంతంలో 31 ఎకరాలు, నిజామాబాద్ ప్రాంతంలో 10 ఎకరాలు, నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న లహరి ఇంటర్నేషనల్ హోటల్లో 50% వాటా, రాయల్ ఓక్ ఫర్నిచర్ షాపుకు లీజుకు ఇచ్చిన 3000 గజాల వాణిజ్య స్థలం, కిలో బంగారు ఆభరణాలు, బ్యాంకు ఖాతాలో రూ.1.37 కోట్ల నగదు, అశోక్ టౌన్ షిప్‌లో రెండు ఫ్లాట్లు, 4000 గజాల స్థలంలో పాలి హౌస్ ఉన్నట్లు గుర్తించామని తెలిపిన ఏసీబీ డీజీ చారుసిన్హా

కిషన్ నాయక్ బంధువుల ఇంట్లో దొరికిన ఆస్తి పత్రాలన్నీ స్వాధీనం చేసుకుని, ఆయన ఆస్తులు రూ.250 కోట్లు ఉంటాయని వెల్లడించిన ఏసీబీ అధికారులు

NO COMMENTS

Exit mobile version