ఆన్‌లైన్ షాపింగ్ ఇప్పుడు ప్రతి ఇంటి భాగమైంది. పాలు, కూరగాయలు, బంగారు నాణేలు వంటి విలువైన వస్తువులు కూడా ఇప్పుడు ఒక్క క్లిక్‌తో ఇంటి వద్దకే చేరుతున్నాయి.
అయితే, తాజాగా ఆన్‌లైన్‌లో బంగారు నాణెం కొనుగోలు చేసిన ఓ వ్యక్తి షాకింగ్ అనుభవం ఎదుర్కొన్నాడు.
ఇన్‌స్టామార్ట్ యాప్ ద్వారా రూ.13,028 విలువైన గోల్డ్ కాయిన్ ఆర్డర్ చేసిన కస్టమర్‌కు పార్శిల్ అందిన తర్వాత, డెలివరీ బాయ్ ముందు దానిని ఓపెన్ చేశాడు. కానీ ప్యాకెట్‌లో ఉన్న కళ్యాణ్ జ్యువెలర్స్ బాక్స్ పూర్తిగా ఖాళీగా ఉండటంతో అతడు అవాక్కయ్యాడు.
అంతకుముందు కూడా ఇలానే ఖాళీ బాక్స్ వచ్చిందని కస్టమర్ వీడియోలో వెల్లడించాడు.
ఈ ఘటనను ఇన్‌స్టాగ్రామ్ యూజర్ దేవ్ కంతురా షేర్ చేయడంతో వీడియో వైరల్‌గా మారింది. ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో ఇంత పెద్ద మోసాలు ఎలా జరుగుతున్నాయో అంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
కస్టమర్ ఈ ఘటనపై ఈ-మెయిల్ మరియు యాప్ ద్వారా ఫిర్యాదు కూడా చేసినట్లు తెలిపారు.
