సికింద్రాబాద్ : తెలంగాణలో యుక్త వయసులో ఉన్నవారికి ఇటీవల ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ గణనీయంగా వృద్ధి చెందుతున్న నేపథ్యంలో మెడికవర్ ఆసుపత్రిలో ప్రత్యేక ప్యాంక్రియాటిక్ క్లినిక్ ప్రారంభించినట్లు వైద్యులు తెలిపారు.
తెలంగాణ లో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు ఇటీవల పెరుగుతున్న నేపథ్యంలో ఆదిలోనే క్యాన్సర్ ను గుర్తిస్తే నివారణ సులభద్రమవుతుందని అన్నారు. ఈ వ్యాధి ప్రారంభ దశలో స్పష్టమైన లక్షణాలు కనబడకపోవడం మూలంగా సమస్యను తీవ్రతరం చేస్తున్నట్లు వెల్లడించారు.
మెడి కవర్ వైద్యుల పరిశీలనలో ఈ వ్యాధి లక్షణాలు, ప్రారంభ దశ గురించి అధ్యయనం చేసినట్లు తెలిపారు. సాధారణంగా కడుపునొప్పి బరువు తగ్గడం జీర్ణ సమస్యల లాంటి లక్షణాలతో ఈ వ్యాధి ప్రారంభమై తీవ్ర స్థాయికి చేరుకుంటుందని అన్నారు. ప్రతి ఏటా భారత్ లో సుమారు 15 వేల ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు నమోదు అవుతున్నాయని పేర్కొన్నారు.
ఆధునిక జీవనశైలి అనారోగ్యకత ఆహారం ఊబకాయం ధూమపానం మద్యపానం చెక్కర వ్యాధి ప్రధాన కారకాలుగా నిపుణులు సూచిస్తున్నారు. ఇటీవల రెండు నెలల్లో మెడికవర్ వైద్య బృందం క్లిష్టమైన ప్యాంక్రియాటిక్ శస్త్ర చికిత్సలను విజయవంతంగా నిర్వహించి సత్ఫలితాలను సాధించినట్లు వెల్లడించారు.
ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అవగాహన నెలను పురస్కరించుకొని మెడికవర్ ఆసుపత్రి వాక్ ధాన్, ఉచిత స్క్రీనింగ్ శిబిరాలు యువ వైద్యుల కోసం శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Sidhumaroju
