Home South Zone Telangana నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు |

నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు |

0

ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానున్న అసెంబ్లీ.

శాసనసభ, శాసన మండలిలో ప్రశ్నోత్తరాలు రద్దు.

ఉభయ సభల్లో దివంగత ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల సంతాప తీర్మానాలు.

శాసనసభలో దివంగత ఎమ్మెల్యేలు రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి కొండా లక్ష్మారెడ్డి ల సంతాప తీర్మానాలు.

శాసనమండలిలో మాధవరం జగపతిరావు.. అహ్మద్ పీర్ షబ్బీర్ ల సంతాప తీర్మానాలు.

శాసనసభ శాసనమండలిలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరావు, సీతక్క వివిధ పేపర్స్ ని సభలో ప్రవేశపెట్టనున్నారు.

ఉభయ సభలు వాయిదా పడ్డ తర్వాత బీఏసీ సమావేశం.

శాసనసభ, మండలి ఎన్ని రోజులు నిర్వహించాలని నిర్ణయించనున్న బీఏసీ.

కనీసం 15 రోజులు సమావేశాలు నిర్వహించాలని పట్టుబడుతున్న బిఆర్ఎస్.

సమావేశాలకు హాజరు కానున్న మాజీ సీఎం బిఆర్ఎస్ అధినేత కేసిఆర్.

అసెంబ్లీ సమావేశాల కోసం నిన్ననే హైదరాబాద్ చేరుకున్న కేసీఆర్.

ఈసారి అసెంబ్లీ సమావేశంలో కృష్ణ గోదావరి నదీ జలాలు, ప్రాజెక్టుల పై ప్రధాన చర్చ.

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీటి కేటాయింపుల తగ్గింపు పై చర్చించాలని పట్టుబడుతున్న గులాబీ పార్టీ.

కృష్ణ గోదావరి ప్రాజెక్టులపై సమగ్ర పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని భావిస్తున్న ప్రభుత్వం.

తమకు పిపిటి అవకాశం ఇవ్వాలని కోరుతున్న బిఆర్ఎస్.

శాసనసభలో డిప్యూటీ స్పీకర్ ఎన్నిక.

ఇటీవల ఆర్డినెన్స్ రూపంలో తీసుకువచ్చిన కొన్ని బిల్లులను శాసనసభలో ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం.

సభను హుందాగా నడుపుకుందామని అన్ని పక్షాలకు పిలుపునిచ్చిన శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు.

ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని డిసైడ్ అయిన బిజెపి.
#sandeep

NO COMMENTS

Exit mobile version