అనకాపల్లి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మునగపాక మండలం తిమ్మరాజుపేటలోని డా విన్సీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో స్విమ్మింగ్ పూల్‌లో పడిపోయి మొదటి తరగతి విద్యార్థి మోక్షిత్ (6) మృతి చెందాడు.
ఉదయం స్కూల్‌కు వెళ్లి సాయంత్రం ఇంటికి రాకపోవడంతో కుటుంబం యాజమాన్యాన్ని సంప్రదించినా స్పందన రాకపోవడంతో వారు నేరుగా స్కూల్‌కు చేరుకున్నారు.
అక్కడ వెతికిన కుటుంబ సభ్యులు స్విమ్మింగ్ పూల్ వద్ద బాలుడి బట్టలు, పక్కనే మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు.
మృతిపై సమాచారం ఇవ్వకపోవడంతో యాజమాన్యంపై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేసి రోడ్డుపై ఆందోళన చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
