యువతకు ఉద్యోగాలు, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం పెట్టుబడుల సదస్సును విజయవంతంగా నిర్వహించింది.
విశాఖ భాగస్వామ్య సదస్సులో రెండు రోజుల్లోనే 400కు పైగా కంపెనీలతో ₹11.91 లక్షల కోట్ల ఒప్పందాలు కుదిరాయి. వీటి ద్వారా 13 లక్షలకు పైగా ఉద్యోగాలు రానున్నాయి. ఐటీ, విద్యుత్, వాణిజ్యం, లాజిస్టిక్స్, ఏవియేషన్, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాల్లో భారీ పెట్టుబడులు వచ్చాయి.
రిలయన్స్, అదానీ, బ్రూక్ఫీల్డ్, టాటా పవర్ వంటి సంస్థలు ఏపీపై విశ్వాసం వ్యక్తం చేశాయి. ఇవన్నీ కార్యరూపం దాల్చితే 20 లక్షల ఉద్యోగాల లక్ష్యం చేరువ కానుంది.




