Home South Zone Telangana 180 కి.మీ వేగంలో రైలు, గ్లాసు నీటికి సవాల్ |

180 కి.మీ వేగంలో రైలు, గ్లాసు నీటికి సవాల్ |

0

దేశంలోని ప్రధాన నగరాలను కలుపుతూ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. త్వరలో స్లీపర్‌ క్లాస్‌ వందేభారత్‌ అందుబాటులోకి వస్తుందని రైల్వే శాఖ తెలిపింది. ప్రస్తుతం రైళ్లు ట్రయల్స్‌ లో ఉన్నాయి.

తాజాగా రోహల్ఖుర్ద్-ఇంద్రఘర్-కోట సెక్షన్‌లో ట్రయల్ రన్‌ జరిగింది. రైలు స్థిరత్వం, బ్రేకింగ్‌, ప్రయాణ అనుభవం పరీక్షించడానికి లోడ్‌తో పాటు ఖాళీగా కూడా టెస్టింగ్‌ జరిగింది.

గంటకు 180 కిలోమీటర్ల టాప్‌స్పీడ్‌ వద్ద మూడు గాజు గ్లాసులతో ‘వాటర్‌ టెస్ట్‌’ నిర్వహించారు. గ్లాసులు తొణకలేదు, ఒకదానిపై ఒకటి ఉంచినప్పటికీ కింద పడలేదు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అయింది. నెటిజన్లు ఇండియన్‌ రైల్వే పనితీర్ను ప్రశంసిస్తున్నారు. వందేభారత్‌ స్లీపర్‌ రైల్లో ప్రయాణానికి ఎదురుచూస్తున్నట్లు ఆసక్తిగా కామెంట్లు పెడుతున్నారు.

Exit mobile version