ఎన్టీఆర్ జిల్లా కీసర టోల్ గేట్ వద్ద తెల్లవారుజామున పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. బస్సు ఎయిర్ పైప్ లీక్ కావడంతో టైర్లు వేడి పెరిగి పొగలు రావడం గమనించిన టోల్ సిబ్బంది వెంటనే డ్రైవర్‌కు తెలిపారు.
డ్రైవర్ బస్సు నిలిపి ప్రయాణికులను త్వరగా దింపడంతో ప్రమాదం తప్పింది. ఈ సమయంలో డ్యూటీలో ఉన్న ఎస్‌ఐ విశ్వనాథ్ టోల్ వద్దే పోలీస్ వాహనంలో నిద్రపోతుండటం వీడియోగా మారింది.
టోల్ సిబ్బంది అప్రమత్తత కారణంగా ఘోర ప్రమాదం నుంచి ప్రయాణికులు రక్షించబడ్డారు.
