గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో బుధవారం “కార్యకర్తలతో ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు ముఖాముఖి” కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ డివిజన్ల నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తమ తమ ప్రాంతాల్లోని సమస్యలను నేరుగా ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకురాగా.
వాటిని శ్రద్ధగా విని తక్షణ పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కార్యకర్తలే పార్టీకి బలం, పార్టీ అభివృద్ధికి మూలస్తంభాలని పేర్కొన్న ఎమ్మెల్యే గారు, వారి సమస్యలు పరిష్కరించడమే తన ప్రధాన బాధ్యత అని తెలిపారు.
నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మరింత వేగంగా అమలు చేసేందుకు కార్యకర్తల సూచనలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు.
ప్రజలతో పాటు కార్యకర్తలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ, సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు భరోసా ఇచ్చారు.
