భారతదేశంలో గుండె జబ్బులు అధిక మరణాలకు ప్రధాన కారణం. 2014–2019 మధ్య గుండెపోటుల సంఖ్య దాదాపు 50% పెరిగింది. పట్టణీకరణ, మారుతున్న జీవనశైలి, అసమతుల్య ఆహారం, ఒత్తిడి, ధూమపానం, మధుమేహం వంటి కారణాలు గుండెపోటుకు దారితీస్తాయి.
అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, రక్తంలో చక్కెర, ధూమపానం ముఖ్య కారణాలుగా గుర్తించబడ్డాయి.
గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించడానికి ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం, రోగనిర్ధారణ పరీక్షలు అవసరం.
పండ్లు, ఆకుపచ్చ కూరగాయలు, తృణధాన్యాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రతిరోజు కనీసం 30 నిమిషాల వాకింగ్ లేదా యోగా, పొగాకు మానడం ముఖ్యమే. 30 ఏళ్లు పైవారికి మరియు కుటుంబ చరిత్ర ఉన్నవారికి రెగ్యులర్ హెల్త్ చెక్‌అప్ తప్పనిసరి.




