రంగారెడ్డి, నవంబర్ 17: ఫరూక్‌నగర్ మండలం ఎల్లంపల్లికి చెందిన చంద్రశేఖర్, భవాని కులాంతర ప్రేమ వివాహం కారణంగా ఘోర ఘటన చోటుచేసుకుంది. నవంబర్ 5న వీరిద్దరూ ఇంటి నుండి పారిపోయి పెళ్లి చేసుకున్న తర్వాత, భవాని తండ్రి వెంకటేష్..
రాజశేఖర్ (చంద్రశేఖర్ అన్న) హత్యకు ప్లాన్ వేసి ఐదుగురితో కలిసి నేరక్రియను అమలు చేశాడు.
నవంబర్ 12 సాయంత్రం, షాద్‌నగర్ సమీపంలో రాజశేఖర్‌ను అడ్డగించి, కాళ్లు, చేతులు కట్టి కారులో తీసుకెళ్లారు.
మహబూబ్‌నగర్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో గడ్డికుప్పలో పెట్రోల్ పోసి దహనం చేశారు. పోలీసులు సీసీ ఫుటేజీల ఆధారంగా వెంకటేష్ సహా ఐదుగురిని అరెస్ట్ చేశారు.
