ఐబొమ్మ వెబ్‌సైట్ నిర్వాహకుడి అరెస్ట్ అనంతరం సినీ ప్రముఖులు హైదరాబాద్ సీపీ సజ్జనార్‌తో భేటీ అయ్యారు. చిరంజీవి, నాగార్జున, ఎస్‌ఎస్ రాజమౌళి, దిల్ రాజు, సురేష్ బాబు పాల్గొన్నారు. పైరసీని అరికట్టిన పోలీసులు కృషిని అభినందించారు.
పైరసీ ముఠాల వల్ల సినిమాకు భారీ నష్టం ఏర్పడుతుండగా, హైదరాబాద్ సైబర్ క్రైం పోలీస్ బృందం, సజ్జనార్ ఆధ్వర్యంలో ఆపరేషన్ విజయవంతం అయింది. ఐబొమ్మ, బప్పమ్ వెబ్‌సైట్ నిర్వాహకులను అరెస్ట్ చేసి, పైరసీకి కీలక బ్లాక్ పెట్టడం దర్శకనిర్మాతలకు స్వాగతార్హం.




