సౌదీ అరేబియాలో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుని విషాదం నెలకొంది. మక్కా నుంచి మదీనాకు బయలుదేరిన ప్యాసింజర్ బస్సు డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొనడం వల్ల భారీగా మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధమైంది.
ఈ ప్రమాదంలో 42 మంది భారతీయ ఉమ్రా యాత్రికులు సజీవదహనమయ్యారని అధికారులు వెల్లడించారు. మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాద్‌కు చెందినట్టుగా గుర్తించారు.
20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నట్లు సమాచారం. బదర్–మదీనా మధ్య ముఫ్రిహాత్ ప్రాంతంలో రాత్రి 1.30 గంటల సమయంలో ప్రమాదం జరిగి, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.




