శబరిమల అయ్యప్ప దర్శనానికి ఏపీ నుంచి వెళ్లే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే శుభవార్త ప్రకటించింది. విశాఖపట్నం–కొల్లాం మధ్య అదనంగా 20 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు తెలిపింది.
ఇందులో విశాఖ నుంచి 10, కొల్లాం నుంచి మరో 10 రైళ్లు నవంబర్ 18 నుంచి జనవరి 20 వరకు అందుబాటులో ఉంటాయి. 08539 ప్రత్యేక రైలు ప్రతి మంగళవారం విశాఖ నుంచి, తిరుగు రైలు ప్రతి బుధవారం కొల్లాం నుంచి బయల్దేరుతుంది.
ఈ రైళ్లు రాజమండ్రి, విజయవాడ, నెల్లూరు, రేణిగుంట తదితర స్టేషన్ల మీదుగా నడుస్తాయి. సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్ కోచ్లు అందుబాటులో ఉండగా ముందస్తు రిజర్వేషన్ కూడా కల్పించారు.




