తెలుగు రాష్ట్రాల్లో వరుసగా బస్సు ప్రమాదాలు భయాందోళన కలిగిస్తున్నాయి. తాజాగా, ఏపీలోని ఎన్డీఆర్ జిల్లాలో K. కావేరి ట్రావెల్స్ బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తుండగా, నందిగామ శివారు అనాసాగరం బైపాస్ వద్ద బస్సు ఓవర్టేక్ చేస్తున్న సమయంలో వెనుక నుంచి వచ్చే లారీని ఢీకొట్టింది.
ఈ ఘటనలో 4 మంది తీవ్ర గాయాలతో, మిగతా ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయి. బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. వెంటనే హైవే మొబైల్ సిబ్బంది బాధితులను నందిగామ ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




