ఏపీలోని బాపట్ల జిల్లా వేటపాలెం గ్రామానికి చెందిన బొడ్డు శ్రీనివాసరావు, కుమార్తె పుట్టిన సంతోషాన్ని పంచుకునేందుకు హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి బైక్‌పై వెళ్ళాడు.
తిరిగి వెళ్లుతూ నల్లగొండ జిల్లా వేములపల్లి సమీపంలో ముందుగా వెళ్తున్న బైక్‌కు ఢీ కొట్టడంతో అదుపు తప్పి కింద పడిపోయాడు.
అదే సమయంలో పక్కనుంచి వస్తున్న ట్రాక్టర్ అతడి ఛాతిపై వెళ్లి మృతిచెందాడు. స్థానికులు, పోలీసులు వెంటనే CPR ప్రయత్నాలు చేసారు, కానీ ఫలితం లేదు. కేసు తండ్రి వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు నమోదు చేశారు.




