గుంటూరులో మరోసారి ఎండిఎం డ్రగ్స్ కలకలం రేపాయి. పాత గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్నపూర్ణ కాంప్లెక్స్ హైవే బైపాస్ వద్ద ఆరుగురు యువకులు బెంగళూరు నుండి తీసుకువచ్చిన ఎండిఎం డ్రగ్ ను చిన్న ప్యాకెట్లుగా మార్చి విక్రయించడానికి సిద్దమవుతున్నారు.
పోలీసులు వారి పై నిఘా ఉంచి 17 గ్రాముల డ్రగ్ స్వాధీనం చేసుకున్నారు.
ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు, ఎండిఎం సింథటిక్ డ్రగ్, అధిక మత్తు కలిగినది. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై దృష్టి పెట్టాలి. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది.




