దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న ‘వారణాసి’ సినిమా ఇప్పుడు వివాదంలో చిక్కింది. రాజమౌళి మూవీ అనౌన్స్‌కి ముందు చిరపురెడ్డి సుబ్బారెడ్డి తన బ్యానర్‌లో టైటిల్‌ను రిజిస్టర్ చేసి పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. టైటిల్ హక్కులు 2026 వరకు ఆయనవే.
గతంలో ‘ఖలేజా’ సినిమాలో కూడా ఇలాంటి వ్యవహారం చోటు చేసుకుంది. ఇప్పుడు పాన్ ఇండియా ట్రెండ్ కారణంగా ఒకే టైటిల్ అన్ని భాషల్లో వాడవచ్చినప్పటికీ, హక్కుల వాదన కొనసాగుతోంది. టాలీవుడ్‌లో ఇలాంటి వివాదాలు కొత్తవి కాదు, ఫైనల్‌గా స్టార్ హీరో సినిమా పేర్లు మాత్రమే గుర్తుండిపోతాయి.




