జగన్ పై కూటమి నేతలు అక్కసును వెళ్లగక్కడమే పనిగా పెట్టుకున్నారా దుర్భుద్ధి తో చూసే వారికీ ప్రజాభిమానం ఎలా తెలుస్తుంది సయ్యద్ గౌస్ మోహిద్దీన్ వైసీపీ మైనారిటీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్కాపురం.వైసిపి అధినేత మాజీ, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ వెళ్ళిన నేపథ్యంలో అభిమానంతో ప్రజలు ఆయన్ని చూసేందుకు
వచ్చారని,దుర్భుదీతో ఆలోచించే టీడీపీ నేతలకు జనాభిమానం అంటే ఏం తెలుస్తుందని వైసీపీ మైనార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ గౌస్ మోహిద్దీన్ శుక్రవారం నాడు ఒక ప్రకటన లో విమర్శించారు
.ఈ సందర్బంగా వైసీపీ నేత సయ్యద్ గౌస్ మోహిద్దీన్ మాట్లాడుతు చంద్రబాబుకు లేని ప్రజాభిమానం జగన్మోహన్ రెడ్డి కి దక్కుతుందన్న ఆసూయ టీడీపీ నేతల్లో గూడుకట్టుకొందన్నారు.
జగన్ కు ఉండే ప్రజాభిమానం చూడలేక,ఓర్వలేక టీడీపీ నేతలు ఆసూయతో విమర్శలు చేస్తున్నారని ఆయన ఏద్దేవా చేశారు. వాస్తవాన్ని ఒప్పుకోవడం టీడీపీ నేతలు అలవాటు చేసుకోవాలన్నారు. లేకపోతే కడుపుమంటతో టీడీపీ నేతలు కుమిలి పోవటం తప్పా మరో మార్గం వారికి లేదన్నారు.
ఆసూయ పూరిత విమర్శలు పక్కనపెట్టి ఏపీలో పాలనను టీడీపీ నేతలు గాడిలో పెడితే బాగుంటుందని ఆయన సూచించారు…




