మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా : మచ్చ బొల్లారం డివిజన్ బర్టన్గూడ లోని హిందూ స్మశానవాటిక అభివృద్ధికి రూ.1 కోటి 90 లక్షలు మంజూరు చేయించడంలో కీలకపాత్ర పోషించిన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, మరియూ స్థానిక కార్పొరేటర్ లను హిందూ స్మశాన వాటిక కమిటీ ఘనంగా సన్మానించింది.
ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మాట్లాడుతూ..
స్మశానవాటిక అభివృద్ధికి కావాల్సిన నిధులు పొందేందుకు పైస్థాయి అధికారులను నిరంతరం అనుసంధానం చేస్తూ అనుమతులు పొందగలిగామని స్మశానవాటికను మోడల్ గ్రేవియర్డ్గా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయని అయన తెలిపారు.
ప్రజల సమస్యలను మాటల్లో కాదు… చేతల్లో చూపడమే తమ పని తీరు అని, నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తూ ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలను కొనసాగిస్తామని ఆయన వివరించారు.
ఈ కార్యక్రమంలో హిందూ స్మశానవాటిక కమిటీ సభ్యులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు తోట లక్ష్మీకాంత్ రెడ్డి, కృష్ణా గౌడ్, సూర్య కిరణ్, శేఖర్, తదితరులు పాల్గొన్నారు.
#Sidhumaroju




