Home South Zone Telangana ఎక్సైజ్ సర్కిల్ కార్యాలయం ప్రారంభించిన MLA.|

ఎక్సైజ్ సర్కిల్ కార్యాలయం ప్రారంభించిన MLA.|

0
1

సికింద్రాబాద్ : బేగంపేటలో ఏర్పాటు చేసిన మారేడ్ పల్లి ఎక్సైజ్ పోలీస్ సర్కిల్ నూతన కార్యాలయ ప్రారంభోత్సవం సోమవారం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ హాజరై, ఎక్సైజ్ ఇంఛార్జ్ డిప్యూటీ కమిషనర్ అనీల్ కుమార్ రెడ్డి, సూపరింటెండెంట్ పంచాక్షరి, అడిషనల్ సూపరింటెండెంట్ శ్రీనివాస రావు తో కలసి కార్యాలయాన్ని ప్రారంభించి, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గా ఛార్జ్ తీసుకుంటున్న జగన్ మోహన్ రెడ్డి  శుభాకాంక్షలు తెలియజేసారు .

అనంతరం ఎమ్మెల్యే శ్రీగణేష్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీని పకడ్బందీగా అమలు చేసి ప్రజలలో మంచి పేరు తెచ్చుకోవాలని ఎక్సైజ్ అధికారులకు సూచించారు.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ముప్పిడి మధుకర్, వేణుగోపాల్ రెడ్డి  ఉన్నారు.

#Sidhumaroju

NO COMMENTS