Home South Zone Telangana పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే.|

పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే.|

0
1

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :   మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే  మర్రి రాజశేఖర్ రెడ్డి, అల్వాల్ డివిజన్ పరిధిలోని ముత్యం రెడ్డి నగర్ ఫేజ్–1 & 2లో రూ. 7.7 లక్షల వ్యయంతో అభివృద్ధి చేసిన ల్యాండ్‌స్కేప్ పార్కులు, బోర్‌వెల్స్, సిట్టింగ్ బెంచీలు, పాత్‌ వే తదితర పార్కు సౌకర్యాలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు.

అలాగే భారతి నగర్‌లో రూ. 18 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్ నిర్మాణ పనులను కూడా ఆయన స్థానిక నాయకులు, ప్రజల సమక్షంలో ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ —
అల్వాల్ డివిజన్ అభివృద్ధి పట్ల తన కట్టుబాటు ఎల్లప్పుడూ కొనసాగుతుందని, ప్రతి కాలనీలో అవసరమైన మౌలిక సదుపాయాలను సమకూర్చేందుకు నిరంతర ప్రయత్నాలు చేస్తున్నామని పేర్కొన్నారు.

ప్రజలు సూచించిన ప్రతి అభివృద్ధి అంశాన్ని ప్రాధాన్యంగా తీసుకుని అధికారులతో సమన్వయం చేస్తూ త్వరితగతిన పూర్తి చేయించే దిశగా పనిచేస్తున్నామని తెలిపారు.
కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ శ్రీమతి శాంతి శ్రీనివాస్ రెడ్డి, స్థానిక కాలనీవాసులు, బిఆర్ఎస్ నాయకులు  పాల్గొన్నారు.

Sidhumaroju

NO COMMENTS