Monday, November 24, 2025
spot_img
HomeSouth ZoneTelanganaహిందూ స్మశానాన్ని మోడల్‌గా అభివృద్ధి చేస్తాం: MLA గణేష్ |

హిందూ స్మశానాన్ని మోడల్‌గా అభివృద్ధి చేస్తాం: MLA గణేష్ |

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: బోయిన్ పల్లి చిన్న తోకట్ట లోని శ్మశాన వాటికను అభివృద్ధి చేయాలని GM అంజయ్య శ్మశాన వాటిక సంక్షేమ సంఘం సభ్యులు ఆదివారం కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్  పికెట్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో కలిసి వినతిపత్రం అందజేశారు.
తనను కలిసిన స్మశాన వాటిక సంక్షేమ సంఘం సభ్యులతో స్మశాన వాటిక అభివృద్ధి గురించి చర్చించి ఈ స్మశాన వాటికను నియోజకవర్గం లోనే మోడల్ స్మశాన వాటికగా అభివృద్ధి చేద్దామని, దానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు.
మొదటి విడతగా ఎమ్మెల్యే నిధుల నుంచి 50 లక్షల రూపాయలను కేటాయిస్తున్నానని, ఈ నిధుల ద్వారా స్మశానవాటికలో దహన వాటికలు, పురుషులు, స్త్రీలు దుస్తులు మార్చుకొనే గదులు, మంచినీటి సదుపాయం తదితర ఏర్పాట్లను చేసుకుందామని, ఈ నిధులు సరిపోకపోతే మరిన్ని నిధులు కేటాయిస్తానని, నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్న నాకు మీరందరూ సహకరిస్తే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులైనా తీసుకువచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పారు.
ఎమ్మెల్యేను కలిసిన వారిలో స్మశాన వాటిక సంక్షేమ సంఘం అధ్యక్షులు కొండల్ యాదవ్, ఉపాధ్యక్షులు సదానంద్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మారుతి గౌడ్, అశోక్, యాదవరావు, రామారావు తదితరులు ఉన్నారు.
Sidhumaroju

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments