మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ సర్కిల్ పరిధిలోని మచ్చబొల్లారం డివిజన్ లో వెలసిన గంగ ఎవెన్యూ కాలనీలో దాదాపు రూ.10కోట్ల విలువైన పార్కు స్థలాన్ని హైడ్రా ఆధ్వర్యంలో పరిరక్షణ చర్యలకు శ్రీకారం చుట్టారు.
ఈమేరకు బుధవారం అల్వాల్ లో హైడ్రా దూకుడు ప్రదర్శిస్తూ పార్కు స్థలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. గంగ ఎవెన్యూ కాలనీకి సంబంధించి 21, 576(పి), 577 సర్వే నెంబర్ లలో దాదాపు 2400 గజాల పార్కు స్థలం ఉన్నట్లు కాలనీ వాసులు వెల్లడించారు.
ఈనేపథ్యంలో ఇటీవల కొంత మంది ఆక్రమణదారుల కండ్లు పార్కు స్థలంపై పడిందని తెలిపారు. ఇట్టి విషయాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఫలితంగా రూ.10కోట్ల విలువైన పార్కు స్థలాన్ని హైడ్రా ఆధ్వర్యంలో కాపాడుకున్నట్లు.. కాలనీ వాసులు హర్షం వ్యక్తంచేశారు.
Sidhumaroju.






